Sunday, January 2, 2011

sankranti lakshmi

పట్టు పరికిణీలు పసుపు పారాణులు
                     ముగ్గుళ్ళ గొబ్బిళ్ళు  బొమ్మరిళ్ళు
గంగిరెద్దుల యాట బుంగసానుల పాట
                     బుడబుడక్కల మోత భోగిమంట
కోడిపందెమ్ములు వేడి పొంగళ్ళును
                     పచ్చని తోరణాల్  పాడిపంట
హరిదాసు కీర్తనల్ అల్లుళ్ళ కోరికల్
                     మరదళ్ల సయ్యాట మామ్మ విసురు
పురుషుల పేకాట తరుణుల సింగార
                     మారార అరిసెల  ఆరగింపు
తెలుగు పల్లెల సంస్కృతుల్ తేజరిల్ల
స్మృతి మధుర మహాకావ్య సంసృష్టి యనగ
అదె ధనుర్మాస మాసాంత మధివసించి
గడప గడపకు వచ్చె సంక్రాంతి లక్ష్మి


  

2 comments:

  1. మెరుగుమిల్లి సుకవి మెరుగులు దిద్దగా,
    జిలుగు చీర కట్టి తళుకు లొలుక
    సత్కవి కవిత వలె సంక్రాంతి లక్ష్మి తా
    వచ్చెనయ్య. కవుల మెచ్చెనయ్య.

    ReplyDelete