Saturday, September 3, 2016

మ ii  మును శీరామ విభుండు రావణుని నిర్మూలించి వైదేహితో
         వినువీధిన్ చనుదెంచె పుష్పకముపై వేగమ్మయోధ్యాపుర
         మ్మునకున్ దైత్యు విమానమంచెరిగి సంభూతాగ్రహోద్వృత్తి  తు
         త్తునియల్ చేసిరి పౌరులా తునకలే తోరంపు ఆటోలయెన్    

Thursday, November 24, 2011

samasya

దయచేసి పద్యకవులు క్రింది సమస్యకు కూడా  పూరణలు వ్రాయండి.

      '' మునికిన్ దక్కిరి భామలిద్దరు మహామోహంబునన్ దేల్చగా ''
   పూరణలు  పంప వలసిన మెయిల్ అడ్రస్సు :

nagaraju_man@yahoo.com        పూరణలు పంపుటకు గడువుతేదీ; 25-12-2011.

Sunday, January 2, 2011

sankranti lakshmi

పట్టు పరికిణీలు పసుపు పారాణులు
                     ముగ్గుళ్ళ గొబ్బిళ్ళు  బొమ్మరిళ్ళు
గంగిరెద్దుల యాట బుంగసానుల పాట
                     బుడబుడక్కల మోత భోగిమంట
కోడిపందెమ్ములు వేడి పొంగళ్ళును
                     పచ్చని తోరణాల్  పాడిపంట
హరిదాసు కీర్తనల్ అల్లుళ్ళ కోరికల్
                     మరదళ్ల సయ్యాట మామ్మ విసురు
పురుషుల పేకాట తరుణుల సింగార
                     మారార అరిసెల  ఆరగింపు
తెలుగు పల్లెల సంస్కృతుల్ తేజరిల్ల
స్మృతి మధుర మహాకావ్య సంసృష్టి యనగ
అదె ధనుర్మాస మాసాంత మధివసించి
గడప గడపకు వచ్చె సంక్రాంతి లక్ష్మి

Thursday, December 23, 2010

ugravaadam

సి.       పరుల హింసకు రాజ్య  పట్టాభిషేకమ్ము   పొసగునో ఒకసారి బుద్ధునడుగు
          ఉగ్రవాదము  తోడ  ఉత్పాతముల్  రేపి    శాసింప నోపునో  యేసునడుగు
          ఆయుధబలముతో  అరిగణ విజయమ్ము   అబ్బునో తలచి మహాత్మునడుగు
         ఆత్మాహుతిదళ   విన్యాసంబుతో లక్ష్య    మందునో మండేల మహితునడుగు
గీ..     హింస యసమర్ధుని బలంబహింసను గొని   విశ్వ సమ్రాట్టులౌ మహావీర కేస
        రులను గనుము చరిత్రను దలచి యింక    ఆయుధములు వీడి జనాళి మనుడు

మ..   వరమీ మానవజన్మ ప్రాక్తన సుకృత్ప్రాప్తంబు ఉన్మాదులై
         పరహింసాచారణైక మత్తులయి సౌభాగ్యంబు  కాల్దన్ని దు
         ర్భర పాపమ్మును మూటగట్టు కొనగా భావ్యంబె ఈ యుగ్రవా
         ద రణౌద్ధత్యము  చాలు రండు మమతా దాతృత్వముల్  నింపగా
ఉత్సాహ..    అందమైన సృష్టిలోని అద్భుతములు  గాంచుమా
                 దైవఘటన , జీవ ధర్మ  తత్వ   మరసి పాడుమా
                సాటివారి కింత తృప్తి, సానుభూతి  పంచుమా
                వలదు వలదు వైరిభావ మిలను పారదోలుమా
    
                 దైవఘటన , జీవతత్వ మరసి పాడుమా
                సాటివారి కింత తృప్తి, సానుభూతి  పంచుమా
                వలదు వలదు వైరిభావ మిలను పారదోలుమా
      
Thursday, August 26, 2010

sarvepalli

మిణుగురు  మిన్నంటి  మిహిర  సంకాశమై 
                దీధితుల్ కురిసిన తీపిగురుతు 
గురు శిష్యబంధమ్ము  తరతరమ్ములకును 
               దివ్యమై తనరారు తీపిగురుతు 
జ్ఞానశక్తి  నియంత సామ్రాట్టులకునైన 
               తృషను తీర్చిన మేటి తీపిగురుతు 
విశ్వంబు విశ్వమే వినయాన్జలుల తోడ 
              ధీసారముంగొన్న తీపిగురుతు 
దార్శనికుడు జగద్వంద్య  తత్వవేత్త , భారతావని ముద్దుల పట్టియైన 
గురువరుండు సర్వేపల్లి. మరులుగొల్పు,సాధుమూర్తి రాధాకృష్ణ సంస్మరణము