Thursday, August 26, 2010

sarvepalli

మిణుగురు  మిన్నంటి  మిహిర  సంకాశమై 
                దీధితుల్ కురిసిన తీపిగురుతు 
గురు శిష్యబంధమ్ము  తరతరమ్ములకును 
               దివ్యమై తనరారు తీపిగురుతు 
జ్ఞానశక్తి  నియంత సామ్రాట్టులకునైన 
               తృషను తీర్చిన మేటి తీపిగురుతు 
విశ్వంబు విశ్వమే వినయాన్జలుల తోడ 
              ధీసారముంగొన్న తీపిగురుతు 
దార్శనికుడు జగద్వంద్య  తత్వవేత్త , భారతావని ముద్దుల పట్టియైన 
గురువరుండు సర్వేపల్లి. మరులుగొల్పు,సాధుమూర్తి రాధాకృష్ణ సంస్మరణము  



2 comments:

  1. మెఱుగుమిల్లికి అభినందనలు.
    కంద గీత గర్భ చంపకమాల.
    సరస గుణంబుగా; వినుత సౌమ్య గుణాదుల వెల్లువౌచు న
    బ్బుర మనగావలెన్ చదువ. పుణ్య ఫలంబుగ చక్క నొప్ప నౌన్.
    ధర సుగుణాఢ్యులున్ ప్రముఖ ధారగ నెన్నగ బ్లాగమర్చి; వ్రా
    య; రహిఁ గనున్ గదా!సఖుఁడ! హాయిగ వ్రాయుము సన్నుతింపగా.
    క.
    సగుణంబుగా; వినుత సౌ
    మ్యగుణాదుల వెల్లువౌచు నబ్బుర మనగా;
    సుగుణాఢ్యులున్ ప్రముఖ ధా
    రగ నెన్నగ బ్లాగమర్చి; వ్రాయ; రహిఁ గనున్.
    తే.గీ.
    వినుత సౌమ్యగుణాదుల వెల్లువౌచు
    చదువ; పుణ్యఫలంబుగ చక్క నొప్ప
    ప్రముఖ ధారగ నెన్నగ బ్లాగమర్చి
    సఖుఁడ! హాయిగ వ్రాయుము సన్నుతింప!

    ReplyDelete
  2. DrMVR గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

    హారం

    ReplyDelete