సి. పరుల హింసకు రాజ్య పట్టాభిషేకమ్ము పొసగునో ఒకసారి బుద్ధునడుగు
ఉగ్రవాదము తోడ ఉత్పాతముల్ రేపి శాసింప నోపునో యేసునడుగు
ఆయుధబలముతో అరిగణ విజయమ్ము అబ్బునో తలచి మహాత్మునడుగు
ఆత్మాహుతిదళ విన్యాసంబుతో లక్ష్య మందునో మండేల మహితునడుగు
గీ.. హింస యసమర్ధుని బలంబహింసను గొని విశ్వ సమ్రాట్టులౌ మహావీర కేస
రులను గనుము చరిత్రను దలచి యింక ఆయుధములు వీడి జనాళి మనుడు
మ.. వరమీ మానవజన్మ ప్రాక్తన సుకృత్ప్రాప్తంబు ఉన్మాదులై
పరహింసాచారణైక మత్తులయి సౌభాగ్యంబు కాల్దన్ని దు
ర్భర పాపమ్మును మూటగట్టు కొనగా భావ్యంబె ఈ యుగ్రవా
ద రణౌద్ధత్యము చాలు రండు మమతా దాతృత్వముల్ నింపగా
ఉత్సాహ.. అందమైన సృష్టిలోని అద్భుతములు గాంచుమా
దైవఘటన , జీవ ధర్మ తత్వ మరసి పాడుమా
సాటివారి కింత తృప్తి, సానుభూతి పంచుమా
వలదు వలదు వైరిభావ మిలను పారదోలుమా
Thursday, December 23, 2010
ugravaadam
సి. పరుల హింసకు రాజ్య పట్టాభిషేకమ్ము పొసగునో ఒకసారి బుద్ధునడుగు
ఉగ్రవాదము తోడ ఉత్పాతముల్ రేపి శాసింప నోపునో యేసునడుగు
ఆయుధబలముతో అరిగణ విజయమ్ము అబ్బునో తలచి మహాత్మునడుగు
ఆత్మాహుతిదళ విన్యాసంబుతో లక్ష్య మందునో మండేల మహితునడుగు
గీ.. హింస యసమర్ధుని బలంబహింసను గొని విశ్వ సమ్రాట్టులౌ మహావీర కేస
రులను గనుము చరిత్రను దలచి యింక ఆయుధములు వీడి జనాళి మనుడు
మ.. వరమీ మానవజన్మ ప్రాక్తన సుకృత్ప్రాప్తంబు ఉన్మాదులై
పరహింసాచారణైక మత్తులయి సౌభాగ్యంబు కాల్దన్ని దు
ర్భర పాపమ్మును మూటగట్టు కొనగా భావ్యంబె ఈ యుగ్రవా
ద రణౌద్ధత్యము చాలు రండు మమతా దాతృత్వముల్ నింపగా
ఉత్సాహ.. అందమైన సృష్టిలోని అద్భుతములు గాంచుమా
దైవఘటన , జీవతత్వ మరసి పాడుమా
సాటివారి కింత తృప్తి, సానుభూతి పంచుమా
వలదు వలదు వైరిభావ మిలను పారదోలుమా
ఉగ్రవాదము తోడ ఉత్పాతముల్ రేపి శాసింప నోపునో యేసునడుగు
ఆయుధబలముతో అరిగణ విజయమ్ము అబ్బునో తలచి మహాత్మునడుగు
ఆత్మాహుతిదళ విన్యాసంబుతో లక్ష్య మందునో మండేల మహితునడుగు
గీ.. హింస యసమర్ధుని బలంబహింసను గొని విశ్వ సమ్రాట్టులౌ మహావీర కేస
రులను గనుము చరిత్రను దలచి యింక ఆయుధములు వీడి జనాళి మనుడు
మ.. వరమీ మానవజన్మ ప్రాక్తన సుకృత్ప్రాప్తంబు ఉన్మాదులై
పరహింసాచారణైక మత్తులయి సౌభాగ్యంబు కాల్దన్ని దు
ర్భర పాపమ్మును మూటగట్టు కొనగా భావ్యంబె ఈ యుగ్రవా
ద రణౌద్ధత్యము చాలు రండు మమతా దాతృత్వముల్ నింపగా
ఉత్సాహ.. అందమైన సృష్టిలోని అద్భుతములు గాంచుమా
దైవఘటన , జీవతత్వ మరసి పాడుమా
సాటివారి కింత తృప్తి, సానుభూతి పంచుమా
వలదు వలదు వైరిభావ మిలను పారదోలుమా
Thursday, August 26, 2010
sarvepalli
మిణుగురు మిన్నంటి మిహిర సంకాశమై
దీధితుల్ కురిసిన తీపిగురుతు
గురు శిష్యబంధమ్ము తరతరమ్ములకును
దివ్యమై తనరారు తీపిగురుతు
జ్ఞానశక్తి నియంత సామ్రాట్టులకునైన
తృషను తీర్చిన మేటి తీపిగురుతు
విశ్వంబు విశ్వమే వినయాన్జలుల తోడ
ధీసారముంగొన్న తీపిగురుతు
దార్శనికుడు జగద్వంద్య తత్వవేత్త , భారతావని ముద్దుల పట్టియైన
గురువరుండు సర్వేపల్లి. మరులుగొల్పు,సాధుమూర్తి రాధాకృష్ణ సంస్మరణము

Subscribe to:
Posts (Atom)